బిర్యానీ పేరు వింటే చాలు నోట్లో నీళ్లురుతాయి కానీ అందులో వేసే దినుసులన్నీ అప్పటికప్పుడు నూరాలి అంటే కాస్త పెద్ద ప్రహసానమే. అదే బిర్యాని మసాలా పౌడర్ సిద్ధంగా ఉందనుకోండి ఉప్మా అంతా సులువు అయిపోతుంది ఈ పౌడర్ చేసేందుకు ఒక జాజికాయ రెండు అంగుళాలు దాల్చిన చెక్క 12 లవంగాలు పది యాలకులు మూడు నల్ల యాలకులు రెండు చెంచాల మిరియాలు పావు కప్పు ధనియాలు చెంచా చొప్పున సోంపు జీలకర్ర నల్ల జీలకర్ర కొద్దిగా జాపత్రి 7 8 బిర్యానీ ఆకులు అర చెంచా పసుపు నాలుగు ఎండుమిర్చి రెండు చెంచాల డ్రైవ్ జింజర్ పౌడర్ ఇంతకీ దీన్ని ఎలా చేయాలంటే కడాయిలో బిర్యాని ఆకులు ఎండుమిర్చి వేయించి పళ్లెంలోకి తీయాలి తర్వాత ధనియాలు జీలకర్ర నల్ల జీలకర్ర సోంపు మంచి సువాసన వచ్చే వరకు వేయించి తీయాలి ఆ తర్వాత జాజికాయ దాల్చిన చెక్క బ్లాక్ కారడమం మిరియాలు యాలకులు లవంగాలు, జాపత్రి కూడా వేయించాలి అన్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పసుపు డ్రై జింజర్ పౌడర్ జత చేస్తే సరి గుమగుమలాడే బిర్యాని మసాలా పౌడర్ తయారైనట్లే దీనిని తడి లేని గాలి చొరబడని సీసాలో భద్రం చేసుకుంటే తినాలనిపించినప్పుడల్లా క్షణాల్లో బిర్యాని చేసుకోవచ్చు
No comments:
Post a Comment