భారతీయ సంస్కృతిలో విద్యను పవిత్రమైనదిగా దైవ సంబంధమైనదిగా పరిగణిస్తామని అయితే నేడు అది భరించలేనిదిగా మారిందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికి చేరువ చేయడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పింది పూణేలో విద్యాసంస్థల ఏర్పాటు చేసేందుకు రెండు ఆర్గనైజేషన్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయడానికి తిరస్కరించింది సంబంధం లేని కారణాలతో తమ దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని జాగృతి ఫౌండేషన్ సంజయ్ మోతక్ ఎడ్యుకేషన్ సొసైటీ పిటిషన్ హైకోర్టు ఫిబ్రవరి 21న తీర్పు చెబుతూ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం కోసం భూమి స్వభావం ఆర్థిక వనరుల లభ్యత మౌలిక సదుపాయాలు వంటి వాటిని పరిశీలించవలసి ఉంటుందని తెలిపింది దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం నిరంకుశత్వం అన్యాయం అని చెప్పలేమని వివరించంది
No comments:
Post a Comment