Thursday, 14 March 2024

మురికిని ఇలా వదిలించండి

 వాటర్ బాటిల్లో సగం వరకు నీళ్లు పోయాలి మిగతా సగంలో నిమ్మకాయ ముక్కలు ఉప్పు ఐస్ ముక్కలను వేసి బాగా షేక్ చేయాలి ఇలా పది నిమిషాలు చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి ఈ విధానంలో బాటిల్ కడగడం వలన బాటిల్లో సూక్ష్మజీవులు పూర్తిగా పోతాయి

టీ స్పూన్ వంటసోడా రెండు టీ స్పూన్ల వెనిగర్ ను బాటిల్లో వేసి మూత పెట్టాలి 20 నిమిషాల తర్వాత బాటిల్ ని బాగా షేర్ చేసి కడగాలి ఇలా కడిగిన బాటిల్ మూత తీసి పూర్తిగా ఆరిన తర్వాత వాడుకోవాలి

వంట సోడా వెనిగర్ ను సమపాళ్లలో తీసుకొని కలపాలి ఈ మిశ్రమాన్ని బాగా మాడిన గిన్నె ఫ్రై పాన్ పై రాసి 20 నిమిషాలు నానబెట్టాలి తర్వాత డిష్ వాషర్ తో రుద్ది కడిగితే మురికి మొత్తం తొలగిపోతుంది

గోరువెచ్చని పాలలో రెండు టీ స్పూన్ల పెరుగు వేసి కలపాలి పాలలో ఈ మిశ్రమం వేసి వడలను వేసి ఐదారు గంటలు నానబెడితే పెరుగు చక్కగా తోడుకుంటుంది ఇప్పుడు ఈ వడలకు తాలింపు వేసి తింటే పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయి పెరుగు లేనప్పుడు ఇలా చేస్తే పెరుగు పులపకుండా పెరుగు వడలు రుచిగా వస్తాయి

వేడినీళ్లలో బేకింగ్ సోడా కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి ఈ నీటిలో టూత్ బ్రష్ ను మునిగేలా వేసి 20 నిమిషాలు నానబెట్టాలి తర్వాత సాధారణ నీటిలో కడిగితే బ్రష్ లో ఉన్న మురికి బ్యాక్టీరియా పోతుంది పది రోజులకు ఒకసారి బ్రష్ లని ఇలా శుభ్రం చేసుకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి

రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల బియ్యం కలపాలి ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను తర్వాత గుడ్ల సునలో ముంచి డీప్ ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది

No comments:

Post a Comment