బ్యాంకింగ్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి తదితర పోటీ పరీక్షలకు హాజరయ్య అభ్యర్థుల కోసం షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఐదు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ఎస్సీ అభివృద్ధి అధికారి రజిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తికర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు బుధవారంలోగా రాష్ట్ర స్టడీ సర్కిల్ కు చెందిన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు శిక్షణకు ఎంపిక చేయడం కోసం ఈ నెల 10 నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లా కేంద్రంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు ఎందుకైన వారికి ఈ నెల 18 నుంచి ఆగస్టు 17 వరకు నిజామాబాద్ లోని షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ శాఖలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు బోధన ఉచిత వసతి భోజన సదుపాయాలతో పాటు 1500 రూపాయల విలువైన స్టడీ మెటీరియల్ కూడా అందిస్తామని తెలిపారు గతంలో శిక్షణ పొందిన వారు మళ్ళి దరఖాస్తు చేసుకోవద్దని సూచించారు
No comments:
Post a Comment