Friday, 15 March 2024

రైల్వే ఉద్యోగాలుకు పిఈటిసి ఉచిత శిక్షణ

 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు ఈ మేరకు పిఈటిసి డైరెక్టర్ సమూజ్వల గురువారం ఒక ప్రకటన లో తెలిపారు ఆసక్తిగల అభ్యర్థులు ఎస్టీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా ఈనెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అభ్యర్థులను వారి విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు మరిన్ని వివరాలు 04027540104 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు

No comments:

Post a Comment