Friday, 15 March 2024

దీర్ఘకాలిక వ్యాధులకు ఫిజియోథెరపీ ఎంతో అవసరం

 దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ ఫిజియోథెరపీ నిపుణురాలు రమాదేవి అన్నారు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఆమె తెలంగాణ వ్యాప్తంగా వృద్ధులకు ఉచితంగా ఫిజియోథెరపీ చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇందులో భాగంగా భిక్నూర్ మండల కేంద్రంతో పాటు పలు ప్రాంతాలలో ఆమె వృద్ధులకు ఫిజియోథెరపీ పరీక్షలు చేశారు గత కొన్ని సంవత్సరాలుగా కీళ్లనొప్పి పక్షవాతంతో బాధపడుతున్న వారు ఆమె చేస్తున్న ఫిజియోథెరపీ వైద్యంతో ఉపశమనం పొందుతున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో ఎంతోమంది పాలు వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పారు అట్టి వ్యాధులకు ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు చిన్న పిల్లల నుంచి బయోవృద్ధుల వరకు తాను ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు నేటి సమాజంలో ఎంతో మంది నిరుపేదలు ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి వారికి తాను ఉచితంగా ఫిజియోథెరపీ చేసి వారి వ్యాధులు నయం చేయడం జరుగుతుందని ఆమె వివరించారు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు వచ్చిన తమను సంప్రదిస్తే తక్షణమే సేవలు అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు కీళ్ల నొప్పులు పక్షవాతంతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా ఫిజియోథెరపీ పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు ఆస్పత్రిలో చుట్టూ తిరిగిన నయం కానీ వ్యాధులు ఫిజియోథెరపీతో నయం అవుతాయని ఆమె తెలిపారు వృద్ధాప్యంలో పలు వ్యాధులతో బాధపడేవారు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వారికి కావలసిన ఫిజియోథెరపీ పరీక్షలు ఉచితంగా చేస్తానని ఈ సందర్భంగా ఆమె వివరించారు సమాజ సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను పలు ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశార



No comments:

Post a Comment