జుక్కల్ మండలంలోని ఖండేబెల్లూర్ గ్రామ పొలిమేరలో ఉన్న బీరప్పలయంలో గురువారం బీరప్ప పండుగను కురుమ కులస్తులు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఖండేబల్లూరు గ్రామం నుండి కుటుంబ సమేతంగా ఊరేగింపుగా నైవేద్యాలు తీసుకువచ్చి ఆలయంలో బీరప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు బీరప్ప కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ పండగ ఉత్సవాలలో శివరాజ్ దేశాయి బసవరాజు రెడ్డి కృష్ణ విట్టల్ కొండ మల్లుగొండ కండుగొండ మారుతి కొండ పండరి సార్ మాణిక్ గొండ తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment