భక్తి మార్గంలో నడవాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానమని తల్లిదండ్రుల సేవ చేస్తే వేయి జన్మల పుణ్యం వస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు శివరాత్రి పండుగ సందర్భంగా బిచ్కుంద మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ మఠం శుక్రవారం రాత్రి జాగరణ శనివారం రోజున పలు గ్రామాలలోని శివాలయాలలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాగరణ ప్రవచనా కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు దేవుడిని అనుగ్రహం లేనిది ఈ కార్యము జరగదని అన్నారు ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవాటు చేసుకుని దైవ కార్యాల్లో భక్తిశ్రద్ధతో పాల్గొనాలన్నారు దేవాలయాల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు ఆధ్యాత్మికంగా యువత ముందుకు వెళ్లాలన్నారు కాశీ విశ్వనాథ మఠాధిపతి సోమయ్యప్ప స్వామిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు


No comments:
Post a Comment