Wednesday, 6 March 2024

ఆధ్యాత్మిక సమాచారం,7-3-2024

అఖండ హరినామ సప్తాహం

పిట్లం మండలం గౌరవరంలో హనుమాన్ మందిరం వద్ద బుధవారం భక్తిశ్రద్ధలతో అఖండ హరినామ సప్తహం ప్రారంభించారు రాంపూర్ కళానుకు చెందిన పోచయ్య మహారాజ్ అధ్యక్షతన వారం రోజులపాటు హరి జాగరణ కాకడ హారతి గాథ భజన ప్రవచనం హరి పార్ట్ హరి కీర్తన భగవద్గీత పారాయణం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు

కరపత్రాలు ఆవిష్కరణ

బాన్సువాడ పట్టణంలోని కోట దుర్గమ్మ ఆలయం మొదటి వార్షికోత్సవ కరపత్రాలను బుధవారం రాత్రి కమిటీ సభ్యుల ఆవిష్కరించారు ఈ నెల 12 నుంచి మూడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు గణపతి పూజ ఆ హోమం శివపార్వతుల కళ్యాణం బోనాల ఊరేగింపు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని కమిటీ సభ్యులు తెలిపారు కార్యక్రమంలో అరుణ్ రాజ్ మమత సునీత సంగీత సావిత్రి అనిత రేఖ పాల్గొన్నారు



ఆర్య సమాజంలో సామూహిక మహా యజ్ఞం

మహాశివరాత్రి సందర్భంగా పట్టణంలోని ఆర్య సమాజ్ మందిరంలో సామూహిక మహా యజ్ఞం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న దరిచే వారు తమ పేర్లను ముందుగానే నమోదు చేయించాలని మరిన్ని వివరణ సభ్యులను సంప్రదించాలని కోరారు

మహాశివరాత్రికి ముస్తాబవుతున్న ఆలయాలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలు ముస్తాబవుతున్నాయి శివరాత్రి రోజున ప్రత్యేక పూజల కోసం అతి పురాతనమైన శివాలయాలను సిద్ధం చేస్తున్నారు మండల కేంద్రంలోని సుమారు 500 ఏళ్ల కాలం నాటి సోమలింగాల ఆలయం జంగమల్ల 22 స్తంభాల శివాలయాలు ఉన్నాయి మండల కేంద్రంలో ఉన్న 22 స్తంభాల శివాలయం నేటికీ చెక్కుచెదరకుండా ఆనాటి కళాకారుల కలను పూర్తిచేస్తోంది మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు రంగులతో తీర్చిదిద్దుతున్నారు. జంగమల్ల శివాలయం వద్ద ఉన్న మంచినీళ్ల భావించే మండల కేంద్రం ప్రజలు తాగునీరు తీసుకునే వారిని పెద్దలు చెబుతుంటారు నంది పెద్దదిగా ఉండి శివలింగం చిన్నదిగా ఉండడంతో కోరుకున్న ముక్కులు తీరుతాయని భక్తులు అధికంగా వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు మండల కేంద్రంలోని సోమలింగాలయం బాగన్నమాట పూర్ లోని శివాలయాలకు నిర్వాహకులు సిద్ధం చేశారు సోమలింగాల ఆలయం 5 00 సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భక్తులు చెబుతుంటారు ఆలయం లోపల నుంచి బిచ్కుంద మఠం వరకు గృహం ఉందని భక్తులు చెబుతుంటారు ఈ ఆలయం కింది భాగంలో భావి ఉంటుంది ఈ బావిలో అన్ని కాలాల్లో నీళ్లు ఉండడం విశేషం ఆలయానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు ముస్తాబు చేశారు




 శివరాత్రి వేడుకలకు ముస్తాబు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బ్రహ్మకుమారీస్ ఓంశాంతి భవనంలో శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు చేశారు భవనాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు శుక్రవారం సహస్ర జ్యోతిర్లింగాల దివ్యదర్శన కార్యక్రమం ఉంటుందని బ్రహ్మకుమారీలు తెలిపారు శివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక ప్రదర్శనలు మెడిటేషన్ కార్యక్రమాలు ఉంటాయని భక్తులు పాల్గొనాలని కోరారు



కోరికలు తీర్చే వీరభద్రుడు శివరాత్రి రోజు లింగంపై సూర్యకిరణాలు దర్శనానికి తరలిరానున్న భక్తులు

సదాశివ్ నగర్ మండలంలోని అట్లూరు ఎల్లారెడ్డి లో కొలువుదీరిన వీరభద్ర స్వామి ఆలయం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం ఇక్కడ స్వామి వారిని భక్తితో ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం ఆలయంలో కొలువైన శివలింగంపై శివరాత్రి రోజు సూర్యకిరణాలు పడడం ఇక్కడే ప్రత్యేకత ఆ సుందర దృశ్యాన్ని చూడడానికి భక్తులు తరలిరానున్నారు ఆలయంలో శివపార్వతులు భద్రకాళి వీరభద్రులు నందీశ్వరుడు విజయ గణపతి విగ్రహాలపై ఉషోదయ కిరణాలు పడడాన్ని మహాశివరాత్రి రోజున దర్శించుకోవచ్చు మహాశివరాత్రికి ముందు తర్వాత కొన్ని రోజులు ఇలా కిరణాలు పడతాయి సూర్యకిరణాలు గర్భాలయంలో పడడంతో విగ్రహాలు వెలిగి పోతుంటాయి.




శివాలయంలో పూజలు

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి శివాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు శశికాంత్ శర్మ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చనలు అభిషేకాలు చేశారు శ్రీకాంతరావు దంపతుల ఆధ్వర్యంలో శివ స్వాములకు బిక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేశారు శివపేక్ష కమిటీ అధ్యక్షుడు నిట్టు నారాయణరావు ప్రతినిధులు తన్నీరు శేఖర్ లద్దూరి లక్ష్మీపతి యాదవ్ చిన్నోళ్ల గోపాలరావు గుడిలి రమణ పెద్ద రావు సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నార



ఆహ్వాన పత్రిక అందజేత

 మహాశివరాత్రి సందర్భంగా బుగ్గ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం రథోత్సవానికి హాజరుకావాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఆహ్వాన పత్రిక అందజేశారు కల్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు కార్యక్రమంలో రామారెడ్డి ఎంపీపీ దశరథ్ రెడ్డి మద్దికుంట ఎంపిటిసి రాజేందర్ మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి తోటలింగం తోటరాజు సుంకర భూమయ్య తదితరులు పాల్గొన్నారు

అయోధ్య సందర్శన

తడవై కి చెందిన భక్తులు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని సందర్శించారు తొలిసారి అయోధ్యలో బాలరాముడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు భక్తుల అరవింద్ రెడ్డి భాస్కర్ రెడ్డి దత్తు మహేష్ రాఘవరెడ్డి రాకేష్ రావు చందు రాజు శ్రీధర్ సుధాకర్ రెడ్డి తదితరులు వెళ్లిన వారిలో ఉన్నారు




No comments:

Post a Comment