అయోధ్య భక్తులను సత్కరించిన మాజీ జెడ్పిటిసి
గాంధారి మండలం నుండి గత వారం రోజుల క్రిందట అయోధ్య రామ మందిరానికి బయలుదేరి స్వగ్రామానికి క్షేమంగా తిరిగి వచ్చిన భక్తులందరికీ సత్కరించిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తనాజిరావు వారి వెంట పడగల రాజేశ్వరరావు బిజెపి మండల అధ్యక్షులు సాయిబాబా శివాజీ రావు శ్రీకాంత్ మహారాష్ట్ర భక్తులు తదితరులు పాల్గొన్నారు
భక్తిశ్రద్ధలతో మల్లన్న కళ్యాణోత్సవం
కామారెడ్డి పట్టణంలోని గొల్లవాడ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక శ్రీ మల్లన్న ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు స్వామివారికి అగ్నిగుండాలలో నడవడం అన్నదానం చేశారు మల్లన్న పట్నాలు వేసి ఒగ్గు కథ అని చెప్పారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం యువజన సంఘం ప్రతినిధులు స్థానికులు పాల్గొని పూజలు చేశారు
శివ స్వాముల పల్లకి సేవ
భిక్కనూరు మండల కేంద్రంలో శివ స్వాములు పల్లకి సేవ ఊరేగింపు సోమవారం నిర్వహించారు వాహనంపై లింగములు ప్రతిష్టించి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు శ్రీ సిద్ధ రామేశ్వరాలయం మహంత్ సదాశివ మహంత్ శివ స్వాములు రామదండు ప్రతినిధులు పాల్గొన్నారు
నసురుల్లాబాద్ మండలంలోని దొరికి సోమలింగేశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు సోమవారం సందర్శించారు ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు అనంతరం ఆవరణలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు ఆయన వెంట మాజీ సర్పంచ్ దుర్గం శ్యామల నాయకులు మోహన్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు
ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గొల్లవాడలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి కళ్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు ఆలయంలో ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు కార్యక్రమంలో ఎదవ సంఘం నాయకులు యూత్ సభ్యులు పాల్గొన్నారు
అలరించిన నృత్యోత్సవం
మహాశివరాత్రి పురస్కరించుకొని కామారెడ్డి లోని కళాభారతి ఆడిటోరియంలో సోమవారం సనాతన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్యం అలరించింది తెలుగు రాష్ట్రాల నుంచి కళాకారులు హాజరై ప్రదర్శన ఇచ్చారు కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా శ్రీ వేద విద్యానంద గిరి స్వామి గాయకుల భిక్షునాయక్ సుజాశ్రీ హాజరయ్యారు ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు కార్యక్రమంలో టిపిఆర్టియు జిల్లా అధ్యక్షుడు అందరూ మనోహర్రావు సనాతన సంస్థ వ్యవస్థాపకుడు మాలోతు నవీన్ శ్లోకబడి ఛైర్మన్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు
అయోధ్య రాముడు దర్శనానికి భక్తులు
కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకు రామభక్తులు దర్శనానికి సోమవారం బయలుదేరారు 1453 మంది భక్తులతో వెళుతున్న రైలును భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు బాలరాముడు దర్శనానికి జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని భక్తులు అయోధ్యకు వెళ్తున్నారన్నారు వారికి తీర్థయాత్ర ట్రస్ట్ అభియాన్ రాష్ట్ర కన్వీనర్ వెంకటరమణారెడ్డి వసతులు కల్పిస్తున్నారని అన్నారు అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ కౌన్సిలర్లు అవధూత నరేందర్ బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు






No comments:
Post a Comment