కనుల పండుగ వేణుగోపాల స్వామి కళ్యాణం
నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్పేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు వేద పండితులు దిగంబర శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు మెదక్ జిల్లా తొగిట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ కళ్యాణానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు అన్నదానం చేశారు
శ్రీ కల్కి ఆలయంలో అన్నదానం కామారెడ్డి శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో మంగళవారం అమ్మ భగవాన్ పాదుక విశేష పూజలు అభిషేకం అన్నదానం నిర్వహించారు బిక్కనూరుకు చెందిన గంజి లక్ష్మీపతి భారతీ దంపతులు అన్నదానం చేయగా దాదాపు 200 మంది పాల్గొన్నారు ప్రతి మంగళవారం మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తున్నందున భక్తులు హాజరుకావాలని ప్రతినిధి బాలు పేర్కొన్నారు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శారదాంబ అమ్మవారికి వార్షికామేశ్వర్ రూపరాణి దంపతులు 21 తులాల వెండిని మంగళవారం విరాళంగా ఇచ్చారు
చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కామారెడ్డికి చెందిన సుభాష్ రెడ్డి కృపారాణి దంపతులు 25వేల రూపాయలను విరాళంగా ఆలయ నిర్వహణకు అందజేశారు
బాన్సువాడ పట్టణంలోని కోట దర్గమ్మ ఆలయ ప్రసమ వార్షికోత్సవం మంగళవారం ప్రారంభమైంది 108 కళాశాలతో పూజతో పాటు యజ్ఞం నిర్వహించారు మూడు రోజులపాటు కార్యక్రమం నిర్వహించనున్నారు
బిచ్కుంద మండలం కందరుపల్లి నుంచి గుడిమెట్ మఠాధిపతి మహాదేవ స్వామి ఆధ్వర్యంలో కొలనుపాకకు మంగళవారం పాదయాత్ర నిర్వహించారు అంబేద్కర్ కూడలి వద్ద మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే వారికి స్వాగతం పలికారు నాల్చారాజు డాక్టర్ రాజు అప్పారావు పటేల్ బసవరాజ్ పటేల్ భక్తులు ఉన్నారు
యాదాద్రి జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన కొలనుపాక రేణుకాచార్యుల దేవస్థానానికి భక్తులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు గుడిమెట్ మహాదేవ మహారాజు ఆధ్వర్యంలో సోమవారం మహారాష్ట్రలోని దగ్గర్నుంచి కొలనుపాక రేణుక చార్యుల దేవస్థానానికి పాదయాత్రగా దిండి బయలుదేరి రాత్రి మండలంలోని కందర్ పల్లి సిద్దేశ్వర దేవస్థానం వద్ద బస చేశారు మంగళవారం కందరపల్లి నుంచి పాదయాత్రగా దిండి బయలుదేరి బిచ్కుంద మీదుగా పెద్ద దేవాడలో పాదయాత్ర భక్తులకు గ్రామస్తులు అల్పాహారం ఏర్పాటు చేశారు మధ్యాహ్నం పాదయాత్ర భక్తులకు వాజిద్ నగర్ గ్రామంలో అన్నదానం ఏర్పాటు చేశారు అక్కడ నుంచి బాన్సువాడ బోర్ల బసవన్న దేవాలయం వద్ద రాత్రి బస చేస్తున్నట్లు మహాదేవ మహారాజు వివరించారు 300 కిలోమీటర్ల దూరంలో గల కొలనుపాక రేణుక చారి దేవస్థానానికి చేరుకోవడానికి పది రోజులలో చేరుకొని స్వయంభుగా వెలసిన రేణుకాచార్యులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు 10 రోజులపాటు పాదయాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించడం జరిగిందన్నారు తిరిగి భక్తులను ఇంటికి చేర్చుతామన్నారు బిచ్కుందలో మాజీ ఎమ్మెల్యే అనుమతి సుండే పాల్గొని మహాదేవ మహారాజ ఆశీస్సులు పొంది నగదును అందజేశారు
కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు రామారెడ్డి మండలం మిస్సన్నపల్లి రామారెడ్డి గ్రామాల మధ్యన వెలసిన కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళవారం స్వామి పర్వదినం కావడంతో పురోహితులు శ్రీనివాస్ శర్మ మంత్రోచ్ఛారణల మధ్యన భైరవుడికి పాలాభిషేకం సింధూర పూజలు అర్చనలు హారతి వంటి పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు 6616 రూపాయల దండలు స్వామివారి మెడలో వేశారు అనంతరం మధ్యాహ్నం స్వామివారి సన్నిధానంలో అన్న ప్రసాద వితరణ చేపట్టారు ఆలయ సిబ్బంది సురేందర్ గుప్తా నాగరాజు తదితరులు పాల్గొన్నారు
విసన్నపల్లి రామారెడ్డి లోని కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం వైభవంగా సింధూర పూజలు నిర్వహించారు
బీర్కూర్ బరంగిడిగి చించోలి దామరంచ గ్రామాలకు చెందిన 150 మంది భక్తులు మంగళవారం యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక సోమనాథ ఆలయానికి పాదయాత్రగా తరలి వెళ్లారు హిందూ ధర్మ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు జంగం నాగభూషణం తదితరులు ఉన్నారు
మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయాభివృద్ధి కోసం కామారెడ్డికి చెందిన ఒంటరి సుభాష్ రెడ్డి 2516 రూపాయలను విరాళం అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి దాతకు స్వామివారి పటాన్ని అందజేశారు
తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఈనెల 14 నుంచి 19 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు బీర్పూర్ శివారులోని రెండు కొండల మధ్య వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ధర్మకర్త బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సొంతంగా 40 లక్షల రూపాయల వ్యయంతో పునర్ నిర్మించారు 8 ఏళ్ల కిందటప్పటి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలయాన్ని ప్రారంభించారు
పెద్ద ప్రభుత్వం విడుదల చేసిన 25 కోట్లతో 2018లో ఆలయాభివృద్ధి పనులు ప్రారంభించారు పూర్తయిన పనులకు 2023 మార్చిలో ప్రారంభోత్సవం చేశారు శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు ఎట్టా శ్రావణమాసంలో మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి వీర సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందడంతో ప్రతి ఆదివారం ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో వచ్చి కొండపైన వనభోజనాలు చేస్తున్నారు బ్రహ్మోత్సవాలు 14వ తేదీన సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం ఉత్సవ అనుజ్ఞ విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనం రక్షాబంధనం మృత్ సంగ్రహనం అంకురార్పణం హవనము తీర్థ ప్రసాద వితరణతో ప్రారంభమవుతాయి 19న ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు శాంతి పాఠం ద్వారా తోరణా పూజ ధ్వజ కుంభారాధన నిత్య హవనము మహాపురుణాహుతి బలిహరణం తదితర కార్యక్రమాలతో ముగ్స్తాయి
శ్రీవారి ఆలయంలో ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగ నిర్వహిస్తున్నాము మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో 25 కోట్లతో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఆలయం తరహాలో తెలంగాణ తిరుమల ఆలయాన్ని అభివృద్ధి చేశాము ఆరు రోజులపాటు వైభవంగా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నాము భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మోత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆలయ ధర్మకర్త తెలిపారు









No comments:
Post a Comment