అలరించిన ఎడ్లబండ్ల ప్రదర్శనలు
నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ శివారులోని త్రిలింగేశ్వర ఆలయం వద్ద శివరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు కొందరు భక్తులు ఎడ్లబండ్లు అందుబాటులో లేక ట్రాక్టర్లను తిప్పారు నాగిరెడ్డిపేట పోలీసులు బందోబస్తు చేపట్టారు
ఎల్లారెడ్డి ల ఎడ్లబండ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు శనివారం పట్టణంలోని నీలకంటేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయం చుట్టూ ఎడ్లబండ్లను ప్రదర్శించారు అనంతరం అన్నదానం చేశారు కార్యక్రమంలో కౌన్సిలర్ నీలకంఠం తదితరులు పాల్గొన్నారు
ఆలయాల ప్రాంగణాలలో అగ్నిగుండాలు
సదాశివ నగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి లోని వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం అగ్నిగుండం నిర్వహించారు స్వామి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు సదాశివ నగర్ మండల కేంద్రంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సనాతన భజన మండలి సభ్యులు భజన కీర్తనలు ఆలపించారు వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచులు బద్దం శ్రీనివాస్ రెడ్డి మడి పెద్ది కవిత ఆనంద్ ఆలయ కమిటీ చైర్మన్ కొప్పుల నరసారెడ్డి వీడిసి చైర్మన్ గంగారెడ్డి వంకాయల రవి వడ్ల రాజేందర్ ఆలయ కమిటీ ప్రతినిధులు భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు
ఎల్లారెడ్డి పట్టణంలోని నీలకంఠేశ్వరాలయంలో శనివారం అగ్నిగుండాలో ఏర్పాటు చేశారు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆలయ ఆవరణలో అగ్నిగుండాలని ఏర్పాటు చేశారు అనంతరం అగ్నిగుండాల నుంచి భక్తులు నడిచి మొక్కలు చెల్లించుకున్నారు కార్యక్రమంలో ఆలయ పూజారి సంగమేశ్వరప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు
హర హర మహాదేవ వాడవాడలలో అన్నదానాలు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీలు జిల్లావ్యాప్తంగా శనివారం ఆయాశైవక్షేత్రాలను భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయాలలో శివపార్వతుల కళ్యాణాలు జరిగాయి పెద్ద ఎత్తున అన్నదానాలు చేశారు ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి
బిబిపేటలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శోభాయ రథయాత్ర నిజాంసాగర్ చంద్రమౌళీశ్వర ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పూజలు కాచాపూర్ వీరేశ్వర ఆలయంలో అన్న పూజ దొరికిలోని సోమేశ్వరాలయంలో భక్తుల సందడి థర్డ్వాయిలోని మల్లికార్జున ఆలయంలో భక్తుల పూజలు కోట దుర్గ మాలయంలో శివపార్వతుల కళ్యాణం కృష్ణాజివాడి శివాలయంలో భజనలు చేస్తున్న భక్తులు కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లిలో పల్లకి సేవలో భక్తులు రుద్రారం లో శివరాత్రి ఉత్సవాలు హాజరైన ఎమ్మెల్యే దుర్గి సోమేశ్వరాలయంలో అన్నదానం బాన్సువాడ పట్టణంలోని శివాలయంలో కృష్ణాజివాడి రాజరాజేశ్వరాలయం వద్ద మద్దూరు సోమలింగాల ఆలయంలో రామారెడ్డి లోని అన్నారంలో పెద్దకూడా కోల్ లోని పాప హరేశ్వర శివాలయంలో అన్నదానాలు చేశారు














No comments:
Post a Comment