Friday 29 March 2024

వన్ కార్డ్ బిజినెస్ సొల్యూషన్స్ డిస్కౌంట్ కార్డ్స్ అందజేత

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో సాందీపని డిగ్రీ కళాశాలలో గురువారం వన్ కార్డ్ బిజినెస్ సొల్యూషన్ ఆధ్వర్యంలో స్పర్శ స్కిన్ హాస్పిటల్ నిమ్మాస్ డెంటల్ అఖిల హాస్పిటల్ సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో 300 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు పలు ఆసుపత్రుల్లో ఓపి మెడికల్ ల్యాబ్లో వైద్య సేవలకు సంబంధించిన డిస్కౌంట్ కార్డులను విద్యార్థులకు అందజేశారు కార్యక్రమంలో సాందీపానికి విద్యాసంస్థల డైరెక్టర్ హరీష్మరణ్రెడ్డి అకాడమిక్ ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ వైద్యులు సందీప్ కుమార్ పుట్ట మల్లికార్జున్ పుట్ట భవాని అభిషేక్ రెడ్డి ప్రతినిధులు రవి కిషోర్ రమ్య శ్రావణి సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు



గృహాల్లో ఉపయోగించే రసాయనాలు ఎలా తయారు చేసుకోవాలి

 ఆర్ట్స్ కళాశాలలో వర్క్ షాప్

నిత్యం గృహాలలో ఉపయోగించే డిటర్జెంట్ పౌడర్ లిక్విడ్ సోప్ ఫ్లోర్ క్లీనర్స్ ఫినాయిల్ హెర్బల్ పౌడర్ నొప్పి నివారణ మందులను తయారు చేసుకోవడం ద్వారా విద్యార్థులు స్వయం ఉపాధి పొందవచ్చని సోర్స్ పర్సన్ ఎం జయంతి అన్నారు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు హాజరైన జయంతి విద్యార్థులు బహుముఖ నైపుణ్యాలు కలిగి ఉండాలన్నారు ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కెమిస్ట్రీ విద్యార్థులకు రసాయనాలపై అవగాహన ఉన్నందున గృహాల్లో నిత్యం ఉపయోగించే వివిధ ఉత్పత్తులను తయారు చేసి స్థానికంగా మార్కెటింగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చన్నారు కళాశాల తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు వర్క్ షాప్ లో వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య కెమిస్ట్రీ అధ్యాపకులు శారద సమన్వయకర్తలు చంద్రకాంత్ శంకరయ్య శ్రీనివాస్ శ్రీలత జుబేరియా రామస్వామి శ్రీనివాసరావు రాజేందర్ స్వాతి సుచరణ్ మానస మరకలు మహిళా గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు మీనా విద్యార్థులు పాల్గొన్నారు



మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కమిటీ 2024 కామారెడ్డి

 సిఐటియు అనుబంధం కలిగిన కామారెడ్డి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నూతన కంపెనీ గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకొని ప్రకటించారు అధ్యక్షుడిగా కందారపు రాజనర్సు ప్రధాన కార్యదర్శిగా ఎండి మహబూబాబాద్ ఉపాధ్యక్షుడిగా పోతారం ప్రభాకర్ దీపక్ దీవెన సహాయ కార్యదర్శిగా మామిండ్ల వేణు భూలక్ష్మి జనార్ధన్ వీరయ్య కోశాధికారిగా విజయ్ ప్రచార కార్యదర్శిగా టి రాజు కార్యవర్గ సభ్యులుగా భూదేవి శివ రాజా భూదేవి లక్ష్మి లక్ష్మణ్ ఆర్ రాములు అన్నపల్లి శ్రీను రాజవ్వ రాజమణి అని ఎన్నుకున్నారు .